ఉద్రిక్త పోరులో ఢిల్లీ విజయం..సన్ రైజర్స్ ఇంటికే

190
Delhi Capitals Won

ఐపిఎల్ 12 సీజన్ లో భాగంగా నిన్న జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో సన్ రైజర్స్ పై ఢిల్లీ విజయం సాధించింది. ఉద్రిక్తంగా జరిగిన మ్యాచ్ లో 2వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణిత 20ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162పరుగులు చేసింది. సన్ రైజర్స్ ఓపెనర్ వృద్దిమాన్ సాహా 8 పరుగలకే అవుట్ అయ్యాడు. గఫ్టిల్ 19 బంతుల్లో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే 36 బంతుల్లో 30పరుగులు చేశాడు. విలియసన్స్ 28పరుగులు, విజయ్ శంకర్ 20పరుగులు చేశారు.

ఆ తర్వాత 163పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 2వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్ పృద్వీ షా 38బంతుల్లో 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ధావన్ 16 బంతుల్లో 17పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత వచ్చిన యువ ఆటగాడు రిషబ్ పంత్ ఢిల్లీకి అండగా నిలిచాడు. ఈ దశలో థంపి వేసిన 18వ ఓవర్లో వరుసగా పంత్‌ 4, 6, 4, 6 కొట్టి మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 21బంతుల్లో 49పరుగులు చేసి చివరి ఓవర్లో అవుట్ అయ్యాడు. నేడు చైన్నైతో ఢిల్లీ తలపడనుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ఫైనల్ కు వెళ్లగా మరో టీం ఎది అన్నది రేపు తెలియనుంది.