పార్కింగ్ ఫీజుపై కేంద్ర రైల్వేమంత్రికి ట్వీట్..!

158
railway
- Advertisement -

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసేవన్నీ బక్వాస్ పనులే..ఏడేళ్లలోనే గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను 70 శాతం పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన సంగతి తెలిసిందే. అంతే కాదు…ప్రజల దగ్గర నుంచి వీలైనంత వరకు డబ్బులు లాగి… తన గుజరాతీ దోస్తులైన అంబానీ, అదానీలకు దోచిపెట్టడం…గత ఏడేళ్లుగా మోదీ చేస్తున్న పని ఇదే. అంబానీల కోసం ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్‌ఎల్‌ను ఎత్తేసి 80 లక్షల మంది ఉద్యోగాలు ఊడబెట్టిన ఘనుడు మన మోదీ సాబ్.. భారత్‌లో ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వేలో కొంత భాగం ప్రైవేటీ కరణ పేరుతో అదానీలకు తాకట్టు పెట్టబోతున్నడు. గరీబ్‌రథ్ రైళ్లు తీసుకువచ్చిన అని గొప్పగా చెప్పుకుని కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో 10 రూపాయలు ఉన్న ప్లాట్‌ఫాం టికెట్‌ను ఏకంగా రూ. 30 రూపాయలు చేసి గరీబోడి జేబు గుల్ల చేసిన మహానాయకుడు మన మోదీ సాబ్…ఇప్పుడు రైల్వే స్టేషన్‌లో అడుగుపెడితే బాదుడే బాదుడు..ప్లాట్‌ఫాం టికెట్ నుంచి పార్కింగ్ ఫీజుల దాకా ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏదైనా వాహనం పార్కింగ్ చేస్తే ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా..అరగంటకు ఏకంగా 500 రూపాయలు…ఏంటీ షాక్‌ అవుతున్నారా…నిజమే…ఏకే జైర‌థ్‌ అనే రిటైర్డ్ ఆర్మీ ఆఫీస‌ర్ ఈ నెల 4వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌కు వెళ్లాడు.

అక్క‌డున్న పార్కింగ్‌లో త‌న వాహ‌నాన్ని పార్క్ చేశాడు. త‌న పని పూర్త‌యిన అనంత‌రం తిరిగి పార్కింగ్‌కు చేరుకున్నాడు. అక్కడ పార్కింగ్ స్టాండ్ నిర్వాహకులు త‌న‌కు ఇచ్చిన పార్కింగ్ ఫీజును చూసి ఆయన షాక్ అయ్యాడు. కేవ‌లం 31 నిమిషాల‌కు రూ. 500 వ‌సూలు చేయ‌డం ఏంట‌ీ…ఇదేక్క‌డి దారుణ‌మ‌ని ప్ర‌శ్నించాడు. అయిన‌ప్ప‌టికీ పార్కింగ్ నిర్వాహ‌కులు ఆయ‌న మాట‌లు ఏ మాత్రం వినిపించుకోకుండా రూ. 500 వ‌సూలు చేశారు. పార్కింగ్ ఫీజు రూ. 423.73 పైస‌లు కాగా, సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ కింద రూ. 38.14 చొప్పున వ‌సూలు చేశారు. ఈ మ్యాటర్‌పై ఆయన మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. కేవలం 31 నిమిషాల‌కు పార్కింగ్ ఫీజు రూ. 500 వ‌సూలు చేయ‌డాన్ని కేటీఆర్ త‌ప్పుబ‌ట్టారు. ఇది దారుణ‌మ‌ని వ్యాఖ్యానించారు. రైల్వే స్టేషన్లలో పార్కింగ్ ఫీజులు అధికంగా వ‌సూలు చేస్తున్న విష‌యాన్ని కేంద్ర రైల్వే మంత్రి ఆశ్విని వైష్ణ‌వ్ దృష్టికి కేటీఆర్ తీసుకెళ్లారు. దీనిపై అధికారుల‌కు సూచ‌న‌లు చేయాల‌ని సూచించారు. చూశారుగా…అచ్చేదిన్ వస్తుందని మోదీ సాబ్ గడ్డం నిమురుకుంటూ చెబుతుంటే ఏంటో అనుకున్నాం..సామాన్యుడే కాదు..కాస్త ఉన్నోడికి కూడా సచ్చేదిన్ వచ్చేసింది…..అంతా మన ఖర్మ..ఇది బీజేపీ బక్వాస్ పాలన..కేంద్రం ఆద్వర్యంలోని రైల్వే స్టేషన్లలో పార్కింగ్ ఫీజులు చూసి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ , ఆ పార్టీ నేతలు సిగ్గుతో తలదించుకోవాల్సిందే..బీజేపీ హఠావో..దేశ్ బచావో..!

- Advertisement -