ఫ్లోరైడ్ రక్కసి నల్లగొండ జిల్లాను అతలాకుతలం చేసింది. వేల మందిని జీవచ్ఛవంలా మార్చింది. కాళ్లు, చేతులు వంకర పోవడంతో.. ఏ పని చేయలేని స్థితిలో ఉండిపోయి, అనేక బాధలను అనుభవించారు. అలాంటి ఫ్లోరైడ్ రక్కసి నుంచి నల్లగొండ జిల్లా ప్రజలకు టీఆర్ఎస్ సర్కార్ విముక్తి కల్పించింది.
ఫ్లోరైడ్ రక్కసికి సంబంధించి గతాన్ని గుర్తు చేస్తూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. నాటి ప్రధాని వాజ్‌పేయిని కలిసి ఫ్లోరైడ్‌ను నివారించాలని ప్రాధేయపడిన కాలేదని ఆనాటి చేదు జ్ఞాపకంను గుర్తు చేశారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ… ప్రధాని టేబుల్ మీద ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి చిత్రం ఆనాటి దుస్థితికి సాక్ష్యమని కేటీఆర్ పేర్కొన్నారు. దశాబ్దాలు అధికారంలో ఉన్నా స్వయంగా ప్రధానికి మొరపెట్టుకున్నా పైసా ఇవ్వలేదు, పరిష్కారం కాలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన శాశ్వతంగా ఈ సమస్య తీర్చిన మాట వాస్తవమని కేంద్రమే పార్లమెంట్లో చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
ఫ్లోరైడ్ రక్కసిని రూపుమాపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందనన్నారు. నాటి ప్రభుత్వాలు నిధులు ఇవ్వలేదన్నారు. నేటి ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా సురక్షతమైన తాగునీరు అందించి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల్లో హృదయాల్లో చిరస్థాయిగా కేసీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారు.