ఇంట్లో జరిగే శుభకార్యానికి బంధువులను పిలిచినట్టు.. ఇంటి పార్టీ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ ఆత్మబంధువులను ఆహ్వానించేందుకు ముఖరా కే గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి ఎంచుకున్న మార్గం ఎంతో స్ఫూర్తిదాయకం అని కొనియాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ప్రతి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి.. కొత్త బట్టలు పెట్టి.. 25 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పండుగకు రావాలని ఆలయంలో పూజ చేసిన ప్రత్యేక ఆహ్వాన పత్రికలను అందించడంలో అడుగడుగునా తెలంగాణ సంప్రదాయం ప్రతిబింబిస్తోందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
కేసీఆర్ తో.. నాలుగు కోట్ల ప్రజలకు దశాబ్దాలుగా పెనవేసుకుని ఉన్న పేగు బంధాన్ని మీ ఆత్మీయ ప్రయత్నం నలుదిశలా చాటిచెబుతోంది… ముఖరా కే గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి గారితోపాటు.. గ్రామంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ బీఆర్ఎస్ పక్షాన హృదయపూర్వక అభినందనలు చెప్పారు. మీలాంటి నిజమైన సైనికులే.. బీఆర్ఎస్ పార్టీకి ఎల్లప్పుడూ శ్రీరామ రక్ష అన్నారు.
ఇంట్లో జరిగే శుభకార్యానికి బంధువులను పిలిచినట్టు.. ఇంటి పార్టీ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ ఆత్మబంధువులను ఆహ్వానించేందుకు ముఖరా కే గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి గారు ఎంచుకున్న మార్గం ఎంతో స్ఫూర్తిదాయకం
ప్రతి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి.. కొత్త బట్టలు పెట్టి.. 25 ఏళ్ల బీఆర్ఎస్… pic.twitter.com/82s0Ma4nu9
— KTR (@KTRBRS) April 14, 2025
Also Read:ఇంటర్ తర్వాతే టెన్త్ రిజల్ట్స్!