ఈ నెల 24న పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు మంత్రి కేటీఆర్. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మహబూబ్‌నగర్‌కు ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ రానున్న ట్టు ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మహబూబ్‌నగర్‌లో హైదరాబాద్ మాదిరి అభివృద్ధిని చేసిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుందన్నారు. ఐటీ పార్క్, పరిశ్రమలు, పార్కులు వంటి సౌకర్యాలతో పట్టణం అభివృద్ధి చెందుతోందన్నారు. 5 ఏళ్లుగా జిల్లా అభివృద్ధి కోసం కేటీఆర్ ఎంతో కృషి చేశారని, ఆయన వస్తే ఈ పట్టణంలో మరింత అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు.
మహబూబ్‌నగర్, భూ త్పూర్, జడ్చర్లను కలిపి భవిష్యత్తులో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏ ర్పాటు చేస్తామన్నారు. పట్టణాల్లో కొ త్తగా వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు ఏర్పా టు చేసి మార్కెట్ల సమస్య తీర్చనున్నట్లు తెలిపారు. వార్డుల్లో 60 మంది తో వేసే కమిటీలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ప్రతి పట్టణంలో తాగునీరు, విద్యుత్, మౌలిక సదుపాయాలు అందిస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందన్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా పనిచేసిన కేసీఆర్‌కు ఈ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ ఉందని తెలిపారు.