60 కోట్ల బ‌డ్జెట్‌తో భ‌క్త క‌న్న‌ప్ప: మోహన్ బాబు

231
mohan babu

విలన్ గా చిత్ర రంగ ప్రవేశం చేసి హీరోగా మారి వందలాది చిత్రాలలో తనదైన నటనను కనబర్చి ప్రేక్షకులను అలరించిన హీరో మోహన్ బాబు. విలక్షణ నటుడిగా కలెక్షన్‌ కింగ్‌గా ప్రేక్షకుల మనసులను దోచుకున్న మోహన్ బాబు నిర్మాతగా కొన్ని సినిమాలను సైతం తెరకెక్కించాడు. కృష్ణంరాజు కెరీర్‌లో ఆల్‌టైమ్ హిట్‌గా నిలిచిన ‘భక్త కన్నప్ప’ కథను ఈనాటి సాంకేతిక నైపుణ్యంతో రూపొందించనున్నారు.

దీనిపై మంచు మోహ‌న్ బాబు శ్రీకాళ‌హ‌స్తి దేవాల‌యంలో అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. రూ.60 కోట్ల బ‌డ్జెట్‌తో విష్ణు….భ‌క్త క‌న్న‌ప్ప అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు అని పేర్కొన్నాడు. ఇందులో న‌టీన‌టులు ఎవ‌రు, డైరెక్ష‌న్ ఎవ‌రు చేస్తార‌నే దానిపై క్లారిటీ ఇవ్వ‌లేదు.

మిథునం త‌ర‌వాత‌ క‌న్న‌ప్ప క‌థ‌ని వెండి తెర‌కెక్కించాల‌ని భావించారు త‌నికెళ్ల భ‌ర‌ణి. ముందు సునీల్‌ని హీరో అనుకొన్నారు. ఆ త‌ర‌వాత విష్ణు చేతికి చేరింది. ఈ క‌థ‌ని ఇప్పుడు బుర్రా సాయిమాధ‌వ్ చేతిలో పెట్టారు‌. భ‌ర‌ణి రాసిన సంభాష‌ణ‌ల్ని బుర్రా తిర‌గ రాస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేయనున్నారు.