గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు మంత్రి కేటీఆర్. ఇందులో భాగంగా ముషిరాబాద్ నియోజకవర్గంలో 11 కోట్ల రూపాయలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను 126 మంది లబ్దిదారులకు అందజేయనున్నారు.
అడిక్‌మెట్‌లో నిర్మించిన మల్టీపర్సస్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. నారాయణగూడలో 4 కోట్ల వ్యవయంతో నిర్మించనున్న మోడల్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్ధాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఎల్‌బీనగర్ సర్కిల్‌లో జలమండలి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జంట రిజర్వాయర్లను ఆయన ప్రారంభిస్తారు. వనస్థలిపురం జింకల పార్కు సమీపంలో ప్రభుత్వం కొత్తగా శాటిలైట్ బస్ టెర్మినల్ నిర్మించాలని నిర్ణయించింది. దీనికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
ఇక ఈనెల 11న బల్దియా పరిధిలో ఉచిత నీటి సరఫరా పథకం అమలు చేయనున్నారు. యూసుఫ్‌గూడ నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఇంటింటికీ 20వేల లీటర్ల వరకు నీటిని ఉచితంగా సరఫరా చేయనున్నారు.