హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలన్న లక్ష్యం నెరవేరుతున్నదని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ పేర్కొన్నారు.కరీంనగర్‌లో ఐటీ టవర్ తలమానికంగా నిలుస్తుందని అన్నారు. ఈనెల 21న ఐటీటవర్‌ను ప్రారంభించేదుకు ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.
3000 వేల పై చిలుకు యువతీయువకులకు ఉపాధి అవకాశాలుకల్పిస్తున్నామని అన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఐటీ టవర్ నిర్మానానికి నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీర్‌కు కరీంనగర్ ప్రజలు రుణపడి ఉంటారాని అన్నారు.కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దిగువ మానేరు జలాశయం పరిధిలోని ఐటీటవర్ నిర్మాణానికి 2018 జనవరి 8న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ఆ వెంటనే పనులు మొదలుపెట్టేందుకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పనులు చేయించడంపై ప్రత్యేకచొరువ చూపారు. ఫలితంగా పనులు పూర్తికావొచ్చాయి. ఫ్లగ్ అండ్ ప్లే పద్ధతిలో ఈ ఐటీ టవర్ పనులు పూర్తిచేయించేందుకు మంత్రి గంగుల ప్రత్యేకచొరువ చూపుతున్నారు.
సుమారు 62 వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలం కంపెనీలకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ టవర్‌లో షిఫ్ట్‌కు 1100 నుంచి 1200 మంది సిబ్బంది పనిచేసే అవకాశం ఉంటుంది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో స్థానికయువత కోసం లర్నింగ్‌సెంటర్‌తోపాటు ఏసీ, నాన్‌ఏసీ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టవర్‌లో సెంట్రల్ ఏసీతోపాటు, 24 గంటల విద్యుత్‌సదుపాయం కల్పించేందుకు అవసరమైన జనరేటర్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు టవర్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకొచ్చాయని అన్నారు.