తెలంగాణ వెదర్ రిపోర్టు…

526
telangana weather report

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వెదర్ రిపోర్టును వెల్లడించింది వాతావరణ శాఖ.మరఠ్వాడ నుండి ఉత్తర ఇంటీరియర్ తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 km ఎత్తు వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతోందన్నారు.

ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్ , కోమురంభీం –ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి మరియు నల్గొండ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.