ఎన్నికల ముందే విపక్షాలు అస్త్రసన్యాసం..

245
ktr slamms oppositon
- Advertisement -

ఎన్నికలకు ముందే విపక్షాలు అస్త్రసన్యాసం చేశామని విమర్శించారు మంత్రి కేటీఆర్. బుధవారం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కేటీఆర్ విపక్షాలది అనైతిక కూటమని మండిపడ్డారు. ప్రగతి నిరోధకంగా వ్యవహరిస్తున్న విపక్షాల వైఖరిని ప్రజలకు వివరిస్తామన్నారు. ఎన్నికల్లో సీట్లు కేటాయించే సమయంలో కొంత అసంతృప్తి సహజమే అని అది పెద్ద సమస్య కాదని నేతలందరికీ అవకాశాలు దక్కుతాయన్నారు. పార్టీని వీడిపోవాలనుకునే వారు ఏదో ఒకటి అనడం సహజం. పోయేవారు పోవచ్చు. వారిని ఆపలేమన్నారు.

రాజకీయాల్లో నీతి ఉండాలని కానీ ప్రస్తుతం తెలంగాణలో విపక్షాలు ప్రభుత్వం ఏం చేసినా అడ్డుకోవాలనే కంకణం కట్టుకున్నాయని తెలిపారు. కర్ణాటకలోకాని.. తమిళనాడులో కాని కావేరీ జలాల అంశంపై రాజకీయ పక్షాలు ఒక్క తాటిపై నిలిచాయని గుర్తుచేశారు. ప్రభుత్వానికి, కేసీఆర్‌కు మంచి పేరు రావద్దనే కుట్రతో పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.

ఢిల్లీ, అమరావతి పాదాల వద్ద పాలన పెట్టవద్దని ప్రజలను అడుగుతామన్నారు. తెలంగాణకు కాంగ్రెస్‌ చేసిన మోసాలు అందరికి తెలుసని,మన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్నిసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేశారో అందరికి గుర్తుందన్నారు. బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపినవారు, ముదిగొండలో కాల్పులు జరిపినవారు ఒక్కటై వస్తున్నారు.. వారి సంగతి ప్రజాక్షేత్రంలోనే తేల్చుతామన్నారు.

- Advertisement -