KTR :కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు!

25
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంపై బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కే‌సి‌ఆర్ ను బద్నామ్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయం చేస్తోందని, కే‌సి‌ఆర్ మరియు తనపై కోపంతో ప్రజలకు నష్టం చేసేందుకు ప్రయత్నిస్తోందని కే‌టి‌ఆర్ మండిపడ్డారు. గత కొన్నాళ్లుగా బి‌ఆర్‌ఎస్ పార్టీ టార్గెట్ చేసుకోని అధికార కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. నిరాధార ఆరోపణలు చేస్తూ గత కే‌సి‌ఆర్ పాలనపై బురద చల్లే ప్రయత్నం చేస్తోంది. అయితే కే‌సి‌ఆర్ పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్దిపై జాతీయ నివేధికలే ప్రశంశలు కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలన్నీ ఒట్టివే అని తేలిపోయింది. ఇక కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. మేడిగడ్డ ప్రాజెక్ట్ లో పగుళ్లను పదే పదే ఎత్తి చూపిస్తూ ప్రాజెక్ట్ ను కంప్లీట్ గా పక్కన పెట్టె ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. .

అయితే కాళేశ్వరం రైతులకు జరుగుతున్న మేలును ఎప్పుడు కూడా ప్రస్తావించలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రైతులకు సమృద్దిగా నీరు అందుతోంది. మరి అలాంటి ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేందుకు కాంగ్రెస్ ఎందుకు ప్రయత్నిస్తోందనేది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ తీరుపై కే‌టి‌ఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కాలేశ్వరానికి పడిన చిన్న బుంగను సరి చేయడం మాని, కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని, కేవలం కే‌సి‌ఆర్ పై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ ఈ రకంగా ప్రవర్తిస్తోందని చెబుతూ ఇలా మాట్లాడినందుకు కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి అంటూ కే‌టి‌ఆర్ వ్యాఖ్యానించారు. దేనికి భయపడేది లేదని మీరు నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు కే‌టి‌ఆర్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి కే‌టి‌ఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read:బీఎస్పీతో కలిసి పనిచేస్తాం:కేసీఆర్

- Advertisement -