అమెరికా పర్యటన విజయవంతం: కేటీఆర్

165
ktr
- Advertisement -

పెట్టుబడులే లక్ష్యంగా సాగిన అమెరికా పర్యటన విజయవంతమైందని తెలిపారు మంత్రి కేటీఆర్. వారం రోజులు,35 సమావేశాలు,4 రౌండ్ టేబుల్ మీటింగ్స్, రూ. 7500 కోట్ల పెట్టుబడులు సాధించామని వెల్లడించారు. తన పర్యటన విజయవంతం కావడానికి కృషిచేసిన ఎన్నారైలకు, తన బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఓవైపు ఎన్నారైలతో స్వరాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరుతూనే మరోవైపు కంపెనీలతో భేటీ అవుతూ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేశారు. ఎన్నారైలతో భేటీలో.. ప్రభుత్వ బడుల బాగు కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తమవంతుగా సాయం చేసి, తాము చదువుకొన్న స్కూల్‌ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీంతో అనేకమంది ఎన్నారైలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ముందుకొచ్చారు.

అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌, వైర్‌లెస్‌ టెక్నాలజీ, ప్రాసెసర్ల తయారీలో దిగ్గజ కంపెనీ క్వాల్కమ్‌ సంస్థ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కేంద్రాన్ని హైదరాబాద్‌లో స్థాపించేందుకు ముందుకొచ్చింది. రూ.3905 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. అలాగే అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ ఫార్మారంగంలో రూ.1750 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. దీంతో పాటు పలు కంపెనీలు సైతం హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్దత వ్యక్తం చేశాయి.

- Advertisement -