కుల, మతల పేరుతో కుట్రలు చేస్తున్నారు- కేటీఆర్‌

210
- Advertisement -

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలానగర్ చౌరస్తాలో టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ షోలో ప్రసంగించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే 6 ఏండ్ల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పనప్పుడు ఎం అవుతుందో అని ఆందోళన ఉండే.. ఒక్కయనేమో తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు అన్నాడు. 6 ఏండ్ల కింద ఎం అయిందో ఇక్కడ ఉన్న కడుతున్న బ్రిడ్జ్ చూస్తున్నం. ఫతే నగర్‌లో బ్రిడ్జ్‌ను మరింత విస్తరించుకుంటున్నం అని కేటీఆర్‌ అన్నారు. ఈ 6 ఏండ్లలో హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ది చేసుకున్నాం అన్నారు.

హైదరాబాద్ నగరంలో కొత్త కొత్త బ్రిడ్జ్ లు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో 5 రూపాయలకే అన్నం పెడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే లక్ష డబల్ బెడ్ రూమ్ లు పూర్తి అయ్యాయి. ఈ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు త్వరలొనే ప్రారాంబిస్తాం. కేసీఆర్ సర్కారు వచ్చాక పేదల న్యాయం జరిగిందా లేదా.. తెలంగాణ రాష్ట్రంలో వృద్దులకు పెన్షన్ 2000,దివ్యఅంగులకు 3016 ఇస్తున్నాం వాస్తవం కాదా.తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని మంత్రి గుర్తు చేశారు.

ఇగ కొందరు మేము వస్తే బండి చాలన్ లు కడుతాం అంటున్నారు. అదే కేంద్రంలో అధికారంలోకి వస్తే 15 లాక్షలు ఇస్తాం అన్నారు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. 6 ఏండ్లలో శాంతి భద్రతల ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగరం ముందుకు పోతుంది. కులం ,మతం పేరుతో వారు కుట్రలు చేస్తున్నారూ. నిన్న వారు భాగ్యలక్ష్మి గుడికి వెళ్లారు.. ఎందుకు మీకు చిత్తరమ్మ తల్లి,బల్కం పేట ఎల్లమ్మ ,తాడ్ బండ్ హనుమాన్ గుడి పనికి రాదా …రాదు ఎందుకంటే వారికి ఇండియా పాకిస్థాన్ కావాలి అని కేటీఆర్‌ దుయ్యబట్టారు.

వరద బాధితులకు ఎన్నికలు అయ్యాక మళ్లీ 10 వేలు ఇస్తాం ఎవరు ఆందోళన చెందకుండా ఉండండి. 6 ఏండ్లలో ఎం చేశామో నేను చూపిస్తా మీరు 60 ఏండ్లలో ఎం చేశారో చూపిస్తారా… హైదరాబాద్‌లో ఆగం చేసే పార్టీ కావాలా.. అభివృద్ధి చేస్తున్న పార్టీ కావాలా. డిసెంబర్ 1న కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించి బల్దియాపై టీఆరెస్ జెండా ఎగురవేయాలని కేటీఆర్‌ కోరారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుండి టీఆర్‌స్ పార్టీలో చేరిన యువకులు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

- Advertisement -