ప్రతి ఒక్క రూపాయి వారికే చేరాలి..

219
KTR Review on Handloom
KTR Review on Handloom
- Advertisement -

హ్యండూలూమ్ టెక్స్ టైల్స్ శాఖాధికారులతో పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు సమీక్ష నిర్వహించారు. ఈ రోజు సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టెక్స్ టైల్స్ డైరెక్టర్ శైలజా రామయ్యర్, ఇతర అధికారులు పాల్గోన్నారు. ఈ సారి బడ్జెట్ లో హ్యండూలూమ్ అండ్ టెక్స్ టైల్స్ శాఖకు కేటాయించిన 1200 వందల కోట్ల బడ్జెట్ నిధుల వినియోగంపైన ప్రధానంగా చర్చించారు. ఈ నిధుల్లో చేనేత రంగానికి ఇచ్చే ప్రత్యేక ప్రొత్సహకాలను అందించేందుకు అనుసరించాల్సిన విధాన రూపకల్పనపైన ప్రధానంగా చర్చ జరిగింది. చేనేత కార్మికులకు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి పారదర్శకంగా, నేరుగా వారికి చేరేలా చూడాలని, ఈ మేరకు ఉండాల్సిన మార్గదర్శకాలను మంత్రికి అధికారులు తెలియజేశారు.

KTR Review on Handloom

చేనేత మగ్గాల గుర్తింపు కోసం జరుగుతున్న సర్వే గురించి మంత్రి ఆరా తీసారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తయ్యే సర్వేలో ఇప్పటికే సూమారు 17 వేల చేనేత మగ్గాలను గుర్తించి, జియో ట్యాగింగ్ చేసినట్టు తెలిపారు. వీటిలో ఎన్ని మగ్గాలు సొసైటీల కింద ఉన్నాయి, సొసైటీల బయట ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలని అధికారులను అదేశించారు. మెత్తం ఉత్పాదాక సామర్ధ్యం ఎంత ఉంటుందో తెలియచేయాలని, వీటి అధారంగానే చేనేత కార్మికులకు ప్రయోజనాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. ముఖ్యంగా యార్న్ ను నేరుగా రాష్ర్టంలోని మిల్లుల నుంచి ప్రొక్యూర్ చేసుకునే అవకాశాలను పరిశీలించాలన్నారు. యార్న్ సబ్సీడీలతో పాటు డైస్ మరియు కెమికల్స్ కూడ అందజేస్తున్నామన్నారు. అందుకే వీటి సరఫరా చేసే పరిశ్రమలతో చర్చించాలన్నారు. వీటిని స్థానికంగా తయారు అయ్యేలా చూడాలన్నారు.

చేనేతల వస్త్రాలను కోనుగోలు చేసేందుకు చేపట్టనున్న ప్రక్రియను పక్బందీగా తయారు చేయాలన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న టెస్కో సంస్ధాగత నిర్మాణంలో మార్పులు తీసుకుని రావాలన్నారు. టెస్కో డివిజనల్ కార్యాలయాలను పునర్వవ్యస్ధీకరించాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంగా సికింద్రాబాద్ డివిజనల్ కార్యాలయాన్ని మార్చాలన్నారు. చేనేత వస్ర్తాల ప్రోక్యూర్మెంట్ స్వతంత్రంగా, పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు చేనేత సోసైటీల పనితీరు పైన రిజిస్ట్రార్ అప్ సోసైటీస్ తో తనీఖీలు చేపట్టాలన్నారు. సోసైటీ నిర్వహణపైన 15 రోజుల్లో ప్రత్యేక సర్వే చేపట్టి, పనిచేయని సొసైటీలపై చర్యలు తీసుకోవాలని మంత్రి అదేశాలు జారీ చేశారు.

- Advertisement -