అపర చాణక్యుడు…తెలంగాణ ముద్దుబిడ్డ…దక్షిణాది నుండి ప్రధానమంత్రిగా ఎన్నికైన తొలి వ్యక్తి పీవీ నరసింహారావు. తుమ్మితే కూలిపోయే ప్రభుత్వాన్ని చిన్న కుదుపులు కూడా లేకుండా ఐదేళ్ల పూర్తి కాలంపాటు నడిపించిన ఘనత ఆయనది. అవసాన దశకు చేరుకున్న దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరులూది ప్రపంచంలో శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టిన ధీరత్వం పీవీది. పీవీ జయంతి నేడు. ఈ నేపథ్యంలో పీవీ సేవలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఏడాదిపాటు ఆయన శతజయంతి ఉత్సవాలను నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
పీవీ శతజయంతిని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ ఆయనకు ఘన నివాళర్పించారు. తెలంగాణ భూమి పుత్రుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞాపభూమిలో ఉదయం 10.30 గంటలకు పీవీ శత జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు.