ఎన్నికల ముందు నానా హడావిడి చేస్తున్న హస్తం నేతలు ప్రభుత్వంపై బురద చల్లుతూ రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన జరగలేదని. 24 గంటల కరెంట్ అమలు కావడం లేదని, ధరణి వల్ల ఉపయోగం లేదని.. అబ్బో హస్తం నేతలు చేస్తున్న విమర్శలు అన్ని ఇన్ని కావు. వారు ఎంత మసిపూసి మారేడు కాయ చేసిన వాస్తవాలు.. అవాస్తవాలు కావని రాష్ట్ర ప్రజలే కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పే పరిస్థితి. ఆరు గ్యారెంటీలు ఆరు హామీలు అంటూ ఓటర్లకు గాలం వేస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో వాటిని అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉండటం కాంగ్రెస్ చేతగానితనానికి నిదర్శనంగా చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో హస్తం నేతలు చేస్తున్న విమర్శలకు ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ సంధించిన ప్రశ్నలు చెంపపెట్టులా ఉన్నాయి.
తెలంగాణలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో 2 లక్షల 2 వేల 735 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి, 1 లక్ష 60 వేల 083 నియమకాలను కేసిఆర్ సర్కార్ పూర్తి చేసిందని.. ఇది తప్పు అని నిరూపించగలవా ? ఈ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా ఉందా ? అని ట్విట్టర్ లో కేటిఆర్ ప్రశ్నించారు. 2004-14 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేవలం భర్తీ చేసిన ఉద్య్హోగాలేన్ని ? కేవలం 10 వేల 116 మాత్రమే కాదా ? ఇది తప్పు అని నిరూపించగలవా ? 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదని, కాదనే దమ్ము ఉందా ? అంటూ సూటిగా రాహుల్ గాంధీని కేటిఆర్ ప్రశ్నించారు.
Also Read:Bigg Boss 7 Telugu:రతిక ఎలిమినేట్
కాంగ్రెస్ పాలనలో ఉద్యోగాల్లేక ఉపాధి లేక తుపాకి చేతబట్టి అడవి బాటా పట్టి యువత నక్సలిజం వైపు అడుగులు వేసింది నిజం కాదా ? కర్నాటకలో 100 రోజుల్లో రెండున్నర ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రగల్భాలు పలికి.. అక్కడ అధికారంలోకి వచ్చి ఆర్నెళ్ళు దాటిన ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పగలరా ? రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఉద్యోగాల భర్తీని మరిచి నిరుద్యోగులను నిండా ముంచిన సంగతి నిజం కాదా ? అంటూ కేటిఆర్ సంధించిన ప్రశ్నలకు కాంగ్రెస్ నేతల కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. యువతను మభ్య పెట్టి నాలుగు ఓట్లు వేయించుకునేందుకే హస్తం నేతల ఫిట్లు తప్పా అంతకు మించి ఆ పార్టీలో ఆవగింజంతా చిత్తశుద్ది కూడా లేదనే టాక్ మంత్రి కేటిఆర్ సంధించిన ప్రశ్నలతో రుజువైంది.
ఈ ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ముందా..రాహుల్ గాంధీ..??
✳️ దేశంలో గత పదేండ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా వుందా..?
✳️ తొమ్మిదిన్నర ఏండ్లలో 2లక్షల 2వేల 735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి.. ఒక లక్షా 60వేల083 నియామకాలను పూర్తిచేసింది మా…
— KTR (@KTRBRS) November 25, 2023