Bigg Boss 7 Telugu:రతిక ఎలిమినేట్

41
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 12 వారాలు పూర్తి చేసుకుంది. తాజా వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యింది రతిక. నాలుగోవారం ఎలిమినేట్ అయి రీ ఎంట్రీ ఇచ్చిన రతిక..ఈసారి గట్టి ప్రయత్నమే చేసినప్పటికి ఫలితం లేకపోయింది. ఇక తనను సేవ్ చేసేందుకు ఎవిక్షన్ పాస్ ఉపయోగించాలని కోరినా ప్రశాంత్ ఒప్పుకోకపోవడంతో చివరికి ఎలిమినేట్ కాక తప్పలేదు.

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో శనివారం ఎలిమినేట్ అయిన అశ్విని ఆదివారం ఎపిసోడ్‌లో స్టేజ్ మీదకి వచ్చింది. ఇక తన జర్నీ వీడియోను నాగార్జున ప్లే చేశారు. ఎలా అనిపించింది అని అడిగితే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్ ఇంత బాగా ఆడతానని కానీ సెల్ఫ్ నామినేషన్ ఇక్కడి వరకూ తీసుకువస్తుందని కూడా నేను అనుకోలేదంటూ అశ్విని చెప్పింది. హౌస్‌లో రెండు గ్రూపులు ఉన్నాయని ఒకటి SPA (శోభా, ప్రియాంక, అమర్), శివాజీ బ్యాచ్ పేరు SPY (శివాజీ, ప్రశాంత్, యావర్) అని చెప్పి అందరికీ బైబై చెప్పింది అశ్విని.

సన్ డే ఫన్ డేలో భాగంగా సరదా గేమ్స్ ఆడించారు నాగ్. ఇలా నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ రాగా చివరిగా రతిక-అర్జున్ మిగిలిపోయారు. వీరిద్దరిలో ఒకరు కాసేపట్లో ఎలిమినేట్ కాబోతున్నారు.. నీ ఎవిక్షన్ పాస్ యూజ్ చేసి కాపాడాలనుకుంటే ఎవరిని కాపాడుతావో చెప్పాలని ప్రశాంత్‌ని కోరారు నాగ్. దీంతో ప్రశాంత్ కాసేపు ఆలోచించింది నేను 14వ వారంలోనే వాడతా అంటూ చెప్పేశాడు.

తర్వాత నాకు హెల్ప్ చేస్తానని ఒకసారి మాటిచ్చావ్ కదా.. ఇలా చూడంటూ ప్రశాంత్‌ని పిలిచింది రతిక. అయితే ప్రశాంత్ మాత్రం ముఖం చూపించకుండా తలదించుకొని వెళ్లిపోయాడు. ఇక శివాజీతో రాయబారం సాగించిన ఫలించలేదు. అయితే చివరకు అంతా ఉహించినట్లే రతిక యూ ఆర్ ఎలిమినేటెడ్ అంటూ నాగార్జున చెప్పేశారు. దీంతో అందరికీ గుడ్ బై చెప్పేసింది రతిక. శివాజీ గట్టిగా హగ్ చేసుకొని ఏదీ ఎక్కువ ఆలోచించకు.. కెరీర్ మీద కాన్సట్రేషన్ పెట్టు అంటూ సలహా ఇచ్చాడు.

Also Read:మొక్కజొన్న పీచుతో ఉపయోగాలు..!

- Advertisement -