చేనేత కార్మికులు అధైర్యపడవద్దు….

258
KTR promise new Textile Policy,
- Advertisement -

రాష్ట్రంలోని చేనేత, పవర్ లూమ్ కార్మికులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని టెక్స్ టైల్ శాఖ మంత్రి కెటి రామరావు తెలిపారు. నిన్న సిరిసిల్లాలో పవర్ లూమ్ కార్మికుడు దోమల రమేష్ అత్మహత్య చేసుకోవడం పట్ల మంత్రి కెటిఆర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి హమీ ఇచ్చారు.

ఈ అత్మ హత్య విషయాన్ని తెలుసుకున్న మంత్రి వెంటనే తన కార్యాలయ ప్రైవేట్‌ సెక్రటరీని, టెక్స్‌ టైల్, హ్యండులూమ్ కమీషనర్ శైలజ రామయ్యార్ సిరిసిల్లాకి పంపించారు. మృతుడి కుటుంబానికి వీవర్ సోసైటీ తరపున లక్షన్నర రూపాయాల అర్ధిక సహయం అందించడంతో పాటు పిల్లల ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. కుటుంబానికి డబుల్ బెడ్ రూం పథకంలో ఇల్లు కేటాయిస్తమని తెలియజేశారు.

KTR promise new Textile Policy

పవర్ లూమ్ కార్మికులను అదుకునేందుకు ప్రభుత్వ ప్రొక్యూర్ చేసుకునే ప్రతి వస్త్రాన్ని చేనేత, పవర్ లూమ్ కార్మికుల నుంచే తీసుకునేలా ప్రభుత్వం ఇప్పటికే సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం పవర్ లూమ్ కార్మికులు అత్యధికంగా ఉన్న సిరిసిల్లా కార్మికులకు రాజీవ్ విద్యామిషన్ పథకంలో సేకరిస్తున్న స్కూల్ యూనిఫాంలను కాంట్రాక్టుకు ఇచ్చామని తెలిపారు. దీని ద్వారా 70 కోట్ల రూపాయాల అర్డర్లు ఇచ్చామని తెలిపారు.
సిరిసిల్లా పవర్ లూమ్ కార్మికులు ఏవరు అదైర్యపడవద్దన్ని మంత్రిధైర్యం చెప్పారు.

గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. సిరిసిల్లాలో చేనేత, మరమగ్గాల కార్మికులను సంక్షోభం నుంచి బయటకు తీసుకుని వచ్చేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మరమగ్గాల కార్మికులకు 5 కోట్ల 65 లక్షలు రుణ మాఫీ చేశామన్నారు. ఏడు కోట్ల 19 లక్షలతో 50 శాతం విద్యుత్ సబ్సీడి ఇచ్చామని మంత్రి తెలిపారు. టెక్నాలజీ అప్ గ్రేడేషన ఫండ్(టీయూఎఫ్‌) నిధి కింద 4 కోట్ల పాత బకాలయిలను విడుదల చేశామని తెలిపారు. పాత మగ్గాలను అప్ గ్రేడేషన్ ద్వారా 15 వేలు కేంద్ర నుంచి 10 వేలు రాష్ర్టం నుంచి సూమారు 5000 మగ్గాలను అప్ గ్రేడ్ చేశామన్నారు.

KTR promise new Textile Policy

ప్రతి కార్మికుడికి కేవలం 80 రూపాయాలతో అర్హులైన వారందరికి మహాత్మగాంధీ బుంకర్ భీమ యోజన ద్వారా 6000 వేల మందికి జీవిత భీమ సౌకర్యం కల్పించామన్నారు. ఈ పథకంలో చేరిన వారి ఇద్దరు పిల్లలకు ఏడాదికి 1200 రూపాయాలు స్కాలర్ షిప్ ఇస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు 600 మందికి ముద్రా బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించామని తెలిపారు. ఇలా త్వరలోనే సిరిసిల్లాతో పాటు పవర్ లూమ్ కార్మికులకు మంచి రోజులు వస్తాయని మంత్రి తెలిపారు. ఈనేపథ్యంలో నేతన్నలకు, లూమ్ కార్మికులకు మంచి రోజులు వస్తాయన్న భరోసా ఇచ్చారు.

త్వరలో చేనేత, టెక్స్ టైల్ కు ప్రత్యేక పాలసీ తీసుకుని వస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పాలసీల ద్వార ప్రభుత్వ విధానాలను, కార్మికులకు లభించే రాయితీలు, సౌకర్యాలను ప్రకటించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పాలసీల కోసం ఇప్పటికే టెక్స్ టైల్ శాఖ కసరత్తులు పూర్తి చేసినట్లు తెలిపారు.

- Advertisement -