KTR: ఆద‌ర్శ నేత సీతారాం ఏచూరి

2
- Advertisement -

ప‌ద‌వుల చుట్టూ ప‌రిభ్ర‌మించే ఈనాటి రాజ‌కీయాల్లో స్థిరంగా, సిద్ధాంతం కోసం నిల‌బ‌డ్డ నాయ‌కుడు సీతారాం ఏచూరి అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఓట్ల రాజ‌కీయం వేరు.. ప్ర‌జ‌ల రాజ‌కీయం వేరు. మేం ఓట్ల రాజ‌కీయంలో వెనుక‌బ‌డ్డ ప్ర‌జ‌ల కోసం పోరాటంలో మాత్రం ముందున్నాం.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఉన్నామ‌ని ఏచూరి చెప్పిన మాట గుర్తుందన్నారు.

తిట్లు, బూతులు, రోత‌మాట‌లతో రాజ‌కీయంగా చ‌లామ‌ణి అవుతున్న ఈ రోజుల్లో ఏచూరి హుందాత‌నం భ‌విష్య‌త్ నాయ‌కుల‌కు ఒక పాఠం అని చెప్ప‌క త‌ప్ప‌దని కేటీఆర్ తెలిపారు. ఎమ‌ర్జెన్సీ చీక‌టి రోజుల్లో జైలు జీవితం త‌ర్వాత భార‌త‌దేశంలో ఆనాడు అత్యున్న‌త స్థానంలో ఉన్న ఇందిరా గాంధీ ముందు నిల‌బ‌డి.. ఒక సామాన్య విద్యార్థి నాయ‌కుడిగా, ఒక్క మాట కూడా తొణ‌క‌కుండా మీరు రాజీనామా చేయండ‌ని మాట్లాడాలంటే ఎంత గుండె ధైర్యం కావాలో ఆలోచించాలన్నారు.

మా పార్టీలు, సిద్ధాంతాలు వేరు కావ‌చ్చు. మీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భిన్నాభిప్రాయాన్ని ప్ర‌క‌టించొచ్చు. వారితో నాకు ప‌రిచ‌యం త‌క్కువే కావొచ్చు. కానీ ఉద్య‌మాల నుంచి వ‌చ్చిన బిడ్డ‌లుగా మా బంధం ర‌క్త‌సంబంధంగానే ఉంటుందన్నారు కేటీఆర్.

Also Read:Harish Rao: బాపూజీ వర్దంతి..నివాళి అర్పించిన హరీశ్

- Advertisement -