దేశంలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గేలా డిలిమిటేషన్ జరిగితే, అది కేవలం ఒక చట్ట సవరణగానో లేదా రాజకీయ ప్రక్రియగానో ముగిసిపోదని.. అది మొత్తం దక్షిణ భారతదేశం అంతటా ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని కేటీఆర్ పునరుద్ఘాటించారు. “మూడేళ్ల క్రితం మేము ఏ స్టాండ్ తీసుకున్నామో, ఇప్పటికీ అదే దృఢమైన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి, వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం” అని ఆయన విమర్శించారు.
దక్షిణాది రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆందోళనలను కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గించి శిక్షిస్తారా? అని ఆయన ప్రశ్నించారు.ఆర్థిక ప్రగతి: దేశాభివృద్ధిలో, జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాల రాజకీయ గళాన్ని నొక్కేయడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు.
జనాభా పెంచుకున్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఇచ్చి, ప్రగతి సాధించిన రాష్ట్రాలకు అన్యాయం చేయడం రాజ్యాంగబద్ధం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
మేమంతా గర్వించదగ్గ భారతీయులమే. దేశాభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్న రాష్ట్రాల ప్రతినిధులం. కానీ, మా హక్కులకు భంగం కలిగితే చూస్తూ ఊరుకోం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ పునర్విభజన ప్రక్రియ శాస్త్రీయంగా, అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
ALso Read:ఎంతసేపు స్క్రీన్ చూస్తే ప్రమాదమో తెలుసా?

