నేటి ఆధునిక కాలంలో వ్యాపారం, వినోదం లేదా సామాజిక అవసరాల కోసం స్క్రీన్‌లు మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయి. వీటిని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినప్పటికీ, మితిమీరిన వాడకం మనకు తెలియకుండానే దృష్టి లోపాలకు దారితీస్తోంది.
చిన్నపిల్లల్లో కళ్లు ఎర్రబడటం, డ్రైనెస్ (పొడిబారడం) నుండి చిన్న వయసులోనే దృష్టి లోపాలు రావడం వరకు అనేక కేసులు పెరుగుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డిజిటల్ ప్రపంచంలో స్క్రీన్‌లను పూర్తిగా మానేయడం అసాధ్యం. అయితే, ఎక్కువ సమయం వీటిని చూడటం వల్ల ‘డిజిటల్ ఐ స్ట్రెయిన్’ ఏర్పడుతుంది” అని తెలిపారు. దీనివల్ల కళ్లు పొడిబారడం, మసకబారడం, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పిల్లల్లో ఇది ‘మయోపియా’ (దూరదృష్టి లోపం)కు దారితీస్తోంది.
పిల్లల కోసం స్క్రీన్ నియమాలు:
పిల్లల విషయంలో వైద్యులు స్పష్టమైన మార్గదర్శకాలను సూచిస్తున్నారు:
2 ఏళ్ల లోపు పిల్లలకు: అస్సలు స్క్రీన్ సమయం ఉండకూడదు.
2 నుండి 5 ఏళ్ల మధ్య: రోజుకు ఒక గంట కంటే తక్కువగా ఉండాలి.
పెద్ద పిల్లలకు: రోజుకు రెండు గంటల లోపు మాత్రమే ఉండాలి.
పెద్దలకు కచ్చితమైన గంటల పరిమితి లేకపోయినప్పటికీ, నియంత్రణ అవసరమని డాక్టర్లు చెబుతున్నారు.
సోషల్ మీడియా వంటి వినోదపు స్క్రీన్ సమయాన్ని రోజుకు రెండు గంటల లోపు పరిమితం చేసుకోవాలి.
నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు ఫోన్‌లు, గ్యాడ్జెట్‌లను పక్కన పెట్టాలి.
అద్భుతమైన ’20-20-20′ సూత్రం
కంటిపై ఒత్తిడిని తగ్గించడానికి ఇది చాలా సులభమైన పద్ధతి:
ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి.
ఇది కంటి కండరాలు విశ్రాంతి పొందేలా చేసి, అలసటను తగ్గిస్తుంది.
ALso Read:‘డెకాయిట్’..మంచి సినిమా తీశాం!
కంటి రక్షణకు చిన్న చిన్న చిట్కాలు:
ప్రతి 20 నిమిషాలకు కాకపోయినా, తరచుగా విరామం తీసుకోవడం అలవాటు చేసుకోండి.
విరామ సమయంలో ఒక స్క్రీన్ నుండి (ల్యాప్‌టాప్) మరో స్క్రీన్‌కు (ఫోన్) మారకండి.
సరైన వెలుతురులో కూర్చోండి మరియు స్క్రీన్‌కు కళ్లకు సరైన దూరం ఉండేలా చూసుకోండి.
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం కళ్లకు కూడా మంచిది.
స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహాతో లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ వాడవచ్చు.

