కేటీఆర్‌…ఒక ట్వీట్‌తో సమస్య పరిష్కారం

24
- Advertisement -

చట్టసభల్లో మహిళ రిజర్వేషన్‌ల కోసం ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత పోరాడుతుంటే…రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ మహిళలకు రక్షణ కోరకు మరో కీలక ముందడుగు వేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ వద్ద అర్థరాత్రి సమయంలో మహిళలకు సురక్షితమైన రవాణాను ఏర్పాటు చేయాలని కోరుతూ హర్షిత అనే ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ప్రజారవాణా వ్యవస్థ మరియు మెట్రో సర్వీసులు అందుబాటులో లేని సమయంలో(రాత్రి 10 నుంచి తెల్లవారుజామున5 గంటలు)వరకు పోలీసులు లేదా ఏదైనా గవర్నమెంట్ అథారిటీ ద్వారా ఆటో క్యాబ్‌లకు ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.

దీన్నిపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్..తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్‌ బస్టాండ్‌లో ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డీజీపీకి కేటీర్ విజ్ఞప్తి చేశారు. మీ విలువైన సూచనను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని, మీరు చేసిన ఈ సూచనకు ధన్యవాదాలు అని మంత్రి కేటీఆర్ రీట్విట్ చేశారు.

అయితే కేటీఆర్ చేసిన ట్వీట్‌కు స్పందించిన డీజీపీ…తప్పకుండా మహిళలకు సురక్షితమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాకింగ్ వ్యవస్థను కూడా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. కార్యచరణ అమలు కోసం అన్ని రకాల మార్గాలను ఆన్వేషిస్తున్నట్టు తెలిపారు. దీంతో కేటీఆర్‌ డీజీపీ అంజనీ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

నూతన సచివాలయం ముహుర్తం ఖరారు..

మహిళా బిల్లుపై దేశవ్యాప్త పోరాటం చేస్తాం

ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత నిరసన దీక్ష..

- Advertisement -