పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు డీల్లీలో రెండో రోజు పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో సమావేశం అయ్యారు. డీల్లీలో జరుగుతున్న వరల్డ్ ఏకానమిక్ ఫోరమ్ కు హజరైన మంత్రి రెండో రోజు ఫోరమ్ లోని కీలక నేతలను కలిసారు.
భారత్ పోర్జ్ కంపెనీ యండి బాబా కల్యాణితో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణలో ఏయిరో స్పెస్, డిఫెన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. దీంతోపాటు తెలంగాణలో ఏయిరో టెక్నాలజీ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ అలోచనను మంత్రి అయనకు తెలిపారు. ప్రపంచంలోని పలు ఏయిరో టెక్, ఢిపెన్స్ యూనివర్సీటీలతో మాట్లాడేందుకు సహకరిస్తామని తెలిపారు. త్వరలోనే హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి కెసియఆర్ తో సమావేశం అవుతానన్న బాబా కల్యాణీ, ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను, పాలసీలను అభినందించారు.
జెకె టైర్స్ చైర్మన్ మరియు యండి రఘుపతి సింఘానీయాతో సమావేశమైన మంత్రి తెలంగాణలో కంపెనీ పేపర్ మిల్లింగ్ రంగంలో ఉన్న అవకాశాలను తెలిపారు. సిర్పూర్ పేపర్ మిల్లుని పునః ప్రారంబించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించి, పేపర్ మిల్లులో పెట్టుబడుల పెట్టాల్సిందిగాసింఘానీయా ను కోరారు. తెలంగాణలో పెట్టుబడులపైన ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు సింఘానియా అసక్తి చూపించారు.
హెచ్ పి ఇండియా యండి నీలమ్ ధావన్ తో మంత్రి సమావేశం అయ్యారు. హైదరాబాద్ లో కంపెనీ కార్యాకలాపాల విస్తరణ, స్మార్ట్ సిటీ సొల్యూషన్ల మీద మంత్రి అమెతో చర్చించారు. తెలంగాణలో ఒక పట్టణాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని స్మార్ట్ సిటీ సొల్యూషన్లతో మార్పు తీసుకుని రావాలన్న మంత్రి ప్రతిపాదనకు హెచ్ పి అంగీకరించింది. త్వరలోనే హెచ్ పూర్తి ప్రతిపాధనలతో ముందుకు వస్తుందన్నారు. నీటి సరఫరా, విద్యుత్ సరఫరాల్లో సాంకేతిక పరిజ్ఘాన సహకారంతో సేవల మెరుగుదలకు సహకరిస్తామని హెచ్ పి తెలిపింది. లాజిస్టిక్స్ దిగ్గజం డిహెచ్ యల్ యండి వికాస్ అనంద్ తో జరిగిన సమావేశంలో తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్న డ్రైపోర్టుల గురించి తెలిపారు. తెలంగాణ రాష్ర్టానికి లాజిస్టిక్స్ రంగంలో అనేక అవకాశాలున్నట్లు తెలిపారు. అశోక్ లేలాండ్ సియివో, యండి వినోద్ కె దాసరితో మంత్రి సమావేశమై అటోమోబైల్ రంగంపై చర్చించారు. ఇప్పటికే మహీంద్రా మహీంద్రా ప్లాంట్ ద్వారా అటోమోబైల్ రంగంలో ముందంజలో ఉన్నామని , పరిశ్రమకు అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో అశోక్ లేలాండ్ తయారీ ప్లాంట్ ఏర్పాటుని పరిశీలించాలన్నారు. తెలంగాణకు తమ సంస్ధ త్వరలోనే ఒక బృందాన్ని పంపుతుందని తెలిపారు. మెబైల్, టెలికాం తయారీ సంస్ధ జడ్ టి ఈ, బ్రిటిష్ టెలికాం సంస్ధల ప్రతినిధులతో పైబర్ గ్రిడ్ కు అవసరమైన టెలికాం పరికారాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. యాక్సెంచర్ గ్రూప్ చైర్ పర్సన్ రేఖ మల్హోత్రా మీనన్ తోసమావేశం అయ్యారు. తెలంగాణలో కంపెనీ విస్తరణను కోనసాగించాల్సిందిగా కోరారు. సీమెన్స్ ఇండియా యండి సునీల్ మాధుర్ ను కలిసారు.
వరల్డ్ ఏకానామిక్ పోరమ్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న ఫిలిప్ రాస్లోర్ తో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు వినూత్నమైన పాలసీలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలుసుకున్న ఫిలిప్ త్వరలోనే రాష్ర్టంలో పర్యటిస్తామని, దావోస్ లో జరిగే వరల్డ్ ఎకానమిక్ పోరంలో తెలంగాణకు భాగసామ్యం కల్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలు అనేక దేశాల పాలసీల కన్నా అత్యుత్తమంగా ఉన్నాయని, ఇలాంటి పాలసీలను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం పెట్టుబడులకు అనూకూల వాతావరణం ఏర్పాటు చేసిందన్నారు.
సిఐఐ ప్రెసిడెంట్ తో మంత్రి సమావేశం
వరల్డ్ ఏకానామిక్ ఫోరమ్ తో కలిసి పనిచేస్తున్న సిఐఐ టాప్ లీడర్ షిప్ తో మంత్రి సమావేశం అయ్యారు. సిఐఐ అధ్యక్షుడు నౌషద్ ఫోర్బ్స్ , చంద్రజీత్ బేరర్జీ, డైరెక్టర్ జనరల్ సిఐఐలతో మంత్రి మాట్లాడారు. సిఐఐ పరిశ్రమ అభివృద్దికి చేస్తున్న కార్యక్రమాలు వారు మంత్రి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా సూమారు 3200 సంస్ధలతో సిఐఐకు భాగసామ్యం ఉందని తెలిపారు. ఈ సంస్ధలను తెలంగాణకు పెట్టుబడులు తీసుకుని వచ్చేలా సహకరించాలని మంత్రి కోరారు. దీంతోపాలు ఇతర, రాష్ర్టాలు, దేశాల్లోని అదర్శవంతమైన విధానాలను, పాలసీలను తమకు తెలియజేస్తే వాటిని అమలు చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని సిద్దంగా తెలిపారు.