మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ . కేటీఆర్ మంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలతో పాటు, నాగచైతన్య, సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ కొన్ని దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారన్నారు.
కేవలం తన గౌరవానికి ఈ ఇమేజ్‌కి భంగం కలిగించాలన్న లక్ష్యంగానే సమంత- నాగచైతన్య పేర్లను తీసుకుంటూ కొండ సురేఖ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారు. ఎలాంటి సాక్షాదారాలు చూపించకుండా అడ్డగోలుగా మాట్లాడిన కొండ సురేఖ ఒక మంత్రి అని, ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణ ప్రజలు నిజాలుగా భ్రమపడేఅవకాశం ఉందని కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులో పేర్కొన్నారు.
భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక, చిల్లర మాటలు మాట్లాడవద్దని సూచించారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులను కూడా వేస్తానని హెచ్చరించారు.
Also Read:నానితో అనిరుధ్ రవిచందర్!