పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ అభిమతమని…అందుకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మారెడ్‌పల్లి గాంధీనగర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్ధాపన చేసిన కేటీఆర్ స్లమ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ మారాలన్నారు. నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో భాగంగా 80 వేల ఇళ్ల నిర్మాణాల పనులు మొదలయ్యాయమని
రాష్ట్ర చరిత్రలో ఒక్క పైసా లబ్దిదారుడు ఇవ్వకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. ప్రజలు ముందుకు వస్తే నగరంలో మరిన్ని ఇళ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్‌తో పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వం చేయూతనందిస్తుందన్నారు.
సమగ్రకుటుంబ సర్వే ప్రకారం అర్హులకు మాత్రమే ఇళ్ల నిర్మాణంలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాష్ట్రంలో 2 లక్షల 70 వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. దేశంలో ఇళ్ల నిర్మాణం కోసం రూ. 16 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్‌దే అన్నారు. కంటోన్మెంట్లో 536 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించనున్నారు.