వీఎస్టీ నుండి ఇందిరాపార్కు ఫ్లైఓవర్‌కు శంకుస్ధాపన..

220
ktr
- Advertisement -

రూ.350 కోట్లతో ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు ఎలివేటెడ్‌ స్టీల్‌ బ్రిడ్జి, రెండో దశలో రూ.76 కోట్లతో రాంనగర్‌ నుంచి బాగ్‌లింగపల్లి వరకు మూడు లేన్ల వంతెన నిర్మిస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. ఇందిరా పార్క్ నుండి వీఎస్టీ వరకు వంతెన నిర్మాణానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి శంకుస్ధాపన చేశారు.

లాక్‌డౌన్‌తో మార్చి నెల నుంచి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీలో నాలుగు రెట్ల వేగంతో పనులను పూర్తిచేశామని, తొమ్మిది నెలల్లో జరగాల్సిన పనులు లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలల్లోనే పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అంబర్‌పేట ఫ్లైఓవర్‌ నిర్మాణం త్వరలో పూర్తిచేస్తామన్నారు. 18 కి.మీ. చొప్పున రెండు ఎలివేటెడ్‌ కారిడార్లు ప్రతిపాదించామని తెలిపారు. రక్షణ రంగ భూములు ఇచ్చేలా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కృషిచేయాలన్నారు.

రూ.6 వేల కోట్లతో ఎస్సార్‌డీపీ పనులు చేస్తున్నామన్నారు. జీహెచ్‌ఎంసీలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. హైరదాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తిచేస్తామని చెప్పారు. రూ.5 వేల కోట్లతో స్కైవేల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, కాలేరు వెంకటేష్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

- Advertisement -