విక్టరీ వెంకటేశ్ తో శేఖర్ కమ్ముల సినిమా

350
shekar kammula
- Advertisement -

వైవిధ్యభరితమైన సినిమాలు తీస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలు మంచి విజయం సాధించాయి. తాజాగా ఉన్న సమాచారం మేరకు శేఖర్ కమ్ముల తర్వాతి సినిమా విక్టరీ వెంకటేశ్ తో తీయనున్నాడని తెలుస్తుంది. ఇటివలే శేఖర్ కమ్ముల వెంకటేశ్ కు కథను వినిపించినట్లు సమాచారం. కథ నచ్చడంతో వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు చిత్రయూనిట్.

కాగా శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య తో లవ్ స్టోరీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈమూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ షూటింగ్ ఇటివలే ప్రారంభమైంది. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఈమూవీ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది.

- Advertisement -