హైదరాబాద్ ‘ఫార్మ’కు స్వర్గధామం….

228
- Advertisement -

ఫార్మా, మెడికల్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు.. తెలంగాణ అనుకూలమైందన్నారు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్. అమెరికా పర్యటనలో భాగంగా మినియా పోలిస్ నగరంలో పర్యటించారు కేటీఆర్. అడ్వామెడ్ పేరుతో నిర్వహించిన వైద్య సదస్సు లో పాల్గొన్నారు. ఫార్మా, మెడికల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశాల్లో పాల్గొన్నారు. ఫార్మా, మెడ్ టెక్ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించిన కేటీఆర్…ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ కు టాప్ ర్యాంక్ దక్కిందని విదేశీ పారిశ్రామికవేత్తలకు తెలిపారు.

ktr

సింగిల్ విండో సిస్టమ్ లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామన్నారు కేటీఆర్. అత్యున్నత ప్రమాణాలతో ఫార్మాసిటీ, వైద్య పరికరాల పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడాలేని విధంగా హెల్త్ కేర్, మెడ్ టెక్ రంగాల్లో ప్రోత్సాహకాలు ఇస్తున్నామని వెల్లడించారు. స్వేఛ్చా వాణిజ్య విధానంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందన్నారు. దేశంలోనే అభివృద్ధిలో ముందుకు సాగుతూ స్నేహపూర్వక విధానాలు అవలంబిస్తున్నట్లు పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు అంతార్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నట్లు వెల్లడించారు.

ktr

అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి రాష్ట్రంలో గుండె వ్యాధుల తగ్గింపునకు సహకరించాలని కోరారు. మంత్రి విజ్ఞప్తి మేరకు అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ బృందం త్వరంలోనే రాష్ట్రంలో పర్యటించేందుకు సుముఖత తెలిపింది. కాగా భోజన విరామ సమయంలో మంత్రి కేటీఆర్‌ అక్కడ స్థానికంగా వేస్తున్న రోడ్లను పరిశీలించారు.

CvFanG7VYAAvUKY

- Advertisement -