పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌..

224
ktr
- Advertisement -

మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఖమ్మం, సత్తుపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలో దాదాపు రూ.432 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాలలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఖమ్మంలో నిర్మించనున్న ఐటీ హబ్‌ రెండోదశ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. టేకులపల్లిలో డబల్‌ బెడ్‌రూం ఇండ్ల గృహసముదాయాన్ని ప్రారంభించారు.
ఖమ్మంలోని శ్రీ శ్రీ సర్కిల్ నుండి వెంకటాయపాలెం వరకు నిర్మించే నాలుగు వరుసల రహదారి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి.

అలాగే ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో మంచినీటి సరఫరాను, ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక హంగులతో ఖమ్మం బైపాస్‌ రోడ్డులో నిర్మించిన నూతన బస్టాండ్‌ను ప్రారంభించారు. అనంతరం బస్టాండ్‌ ప్రాంగణంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. అనంతరం సత్తుపల్లి పురపాలక సంఘం భవనాన్ని ప్రారంభించారు. ఖమ్మం పట్టణంలో ఆధునికరించిన వైకుంఠదామాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రులు ప్రశాంత్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామానాగేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిథులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

- Advertisement -