ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లో నైట్ ఫ్రాంక్ కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…. హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఐటీ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
రియల్ ఎస్టేట్ సర్వేలో నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రసిద్ధిగాంచిందని తెలిపారు. అమెజాన్, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో ఆఫీసులు ప్రారంభించాయి. ఇండ్లు, స్థలాల ధరలు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
కరోనా నియంత్రణలో ఇతర రాష్ర్టాల కంటే చాలా మెరుగ్గా ఉన్నామని తెలిపారు. వరల్డ్ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా, బల్క్ డ్రగ్ ప్రొడక్షన్‌లో అగ్రగామిగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో వర్షాలు, వరదలను తట్టుకునేలా నాలాలను అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్‌తో పాటు నైట్ ఫ్రాంక్ ఇండియా లీడర్‌షిప్ సిబ్బంది పాల్గొన్నారు.