బిగ్ విన్…కాదు మనమే గెలుస్తాం: ట్రంప్‌ – బిడెన్ ధీమా

220
trump
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు హోరాహోరిగా సాగుతున్నాయి. ప్ర‌స్తుతం బిడెన్ 237, ట్రంప్ 213 ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌ను కైవ‌సం చేసుకున్నారు. దీంతో గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా జాతినుద్దేశించి మాట్లాడిన డెమోక్రాటిక్ అభ్యర్ధి జో బిడెన్ …ఇలాంటి రసవత్తర పోటీని ముందే ఉహించామని…ఇప్పటివరకు వచ్చిన ఫలితాల పట్ల సంతోషంగా ఫీలవుతున్నామని వెల్లడించారు. అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను తేల్చేందుకు దేశం యావ‌త్తు చివ‌రి ఓటును లెక్కించే వ‌ర‌కు వేచి ఉండాల‌ని….తన మ‌ద్ద‌తుదారులంతా సంయ‌మ‌నంతో ఉండాల‌ని కోరారు.

ఇక అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసిన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌ను ట్విట్ట‌ర్ సంస్థ తొల‌గించింది. భారీ విజ‌యం దిశ‌గా వెళ్తున్నామ‌ని, ఎన్నిక‌లను కైవ‌సం చేసుకోనున్న‌ట్లు ట్రంప్ చేసిన ట్వీట్‌ను ట్విట్ట‌ర్ త‌న అకౌంట్ నుంచి తొల‌గించింది. అయితే ట్రంప్ పోస్టు ఎన్నిక‌ల ప్ర‌క్రియను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ఉందని అందుకే డిలీట్ చేశామని ట్విట్ట‌ర్ పేర్కొన్న‌ది.

- Advertisement -