హోంగార్డు కుటుంబానికి మంత్రి కేటీఆర్ సాయం..

238
ktr siricilla
- Advertisement -

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ తన ఉదారతను చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విధులు నిర్వహిస్తూ చనిపోయిన హోంగార్డు దేవయ్య(50) కుటుంబానికి అండగా నిలిచారు.

దేవయ్య కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. ఆర్థికసాయంతో పాటు హోంగార్డు కుటుంబాన్ని ఆదుకుంటామని హామీఇచ్చారు కేటీఆర్.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన సిలువేరి దేవయ్య సిరిసిల్ల పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీలో భాగంగా సిరిసిల్లలోని ఎల్లమ్మ చౌరస్తాలో సొమ్మసిల్లి పడిపోగా ఆస్పత్రికి తరలిస్తుండగా మృత్యువాడ పడ్డారు.

- Advertisement -