తెలంగాణ అన్ని రకాల ఫార్మా సంస్థలకు అనుగుణంగా ఉన్న బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకు కేంద్రం మొండిచెయ్యి చూపిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు అన్ని రకాల ఏర్పాట్లు ఉన్న వాటి ఉపయోగించుకొవాడానికి అనుమతి లభించకపోవడం చాలా బాధకరమన్నారు. తెలంగాణపై వివక్షతో మోదీ సర్కారు దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మాసిటీ అత్యంత అనుకూలమని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి అన్ని రకాల వ్యాక్సిన్‌లు ఉత్పత్తి జరుగుతుందన్నారు.
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని రకాలగా సహాయపడుతన్నారు. భూసేకరణ పర్యావరణ అనుమతులు మాస్టర్ ప్లానింగ్‌తో సిద్ధంగా ఉన్న ఫార్మా సిటీని కేంద్రం కావాలనే విస్మరించిందన్నారు. తెలంగాణ గతంలోనే హైదరాబాద్‌ను ఫార్మాహబ్‌గా నిలబెట్టే విధంగా కృషి చేస్తుందన్నారు. కానీ కేంద్రం తెలంగాణ అభివృద్ధిపై కక్ష కట్టిందన్నారు. కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలంటే కనీసంగా మూడేళ్లు పడుతుందని తెలిపారు. అన్ని సిద్దంగా ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీని పరిగణలోనికి తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు.
అత్మనిర్బరత దిశగా స్వయం సమృద్ధి సాధించాలంటే రాష్ట్రాలపై కేంద్రం అణిచివేయడం సరికాదన్నారు. అన్ని అనుకూలతలు అనుమతులతో సిద్ధంగా ఉన్నహైదరాబాద్ ఫార్మాసిటీకి మొండిచెయ్యి ముమ్మాటికీ వివక్షేనని ధ్వజమెత్తారు. తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించాలని కేంద్రానికి మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.