వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలి..

101
KTR

చేనేత వస్ర్తాలను ప్రోత్సహించేందుకు టెక్స్ట్ టైల్ శాఖ మంత్రి కేటీఆర్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. చేనేత వస్ర్తాల వినియోగం కోసం చేనేత లక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను..మంత్రులను, శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్ ను కలిసి తెలంగాణ రాష్ర్ట హ్యండ్లూమ్ కోపరేటివ్ సోసైటీ ( టెస్కో) సంస్ద తయారు చేసిన చేనేత వస్ర్తాలను వారికి అందజేశారు. చేనేత వస్ర్తాలకు చేయూతనిచ్చేందుకు ప్రజా ప్రతినిధులు కూడా కలసి రావాలని వారిని కోరారు. మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అభినందించారు.

KTR

చేనేత కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టామని..అందులో భాగంగానే ఇప్పుడు చేనేత లక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు మంత్రి కేటీఆర్‌. ఈ కార్యక్రమంలో భాగంగా తొమ్మిది నెలల పాటు నెలకు వెయ్యి రూపాయాలు పొదుపు చేస్తే పదో నెలలో 14,400 విలువైన చేనేత వస్ర్తాలను అందిస్తున్నామని తెలిపారు. ఈ చేనేత లక్ష్మి కార్యక్రమంలో మంత్రులు, వారి ఉద్యోగులను చేరేలా చూసి, చేనేత వస్ర్తాల వినియోగాన్ని పెంచేలా చూడాలన్నారు. ఈ చేనేత వస్ర్తాలను కోనుగోలు చేసేందుకు టెస్కో వెబ్ సైట్లో అవకాశం ఉన్నదని, ఈ వెబ్ సైట్‌ను మరింత అకర్షనీయంగా తయారు చేయాలని మంత్రి టెస్కో అధికారులను అదేశించారు.

KTR

అమెజాన్, ప్లిప్ కార్ట్ వంటి ప్రధాన అన్ లైన్ స్టోర్లలో టెస్కో వస్ర్తాలు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. తన పరిధిలో ఉన్న మున్సిపల్, మైనింగ్, పరిశ్రమల శాఖాధిపతులుతో మాట్లాడిన మంత్రి ఖచ్చితంగా వారంలో ఓక రోజు చేనేత వస్ర్తాలు ధరించేలా చూడలన్నారు. ప్రతివారం గ్రీవెన్స్ డే రోజు తమ ఉద్యోగులు చేనేత వస్ర్తాలు ధరించేలా నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్‌ఎంసీ కమీషనర్ జనార్ధన్ రెడ్డి మంత్రి తెలిపారు. దీంతో ప్రజలకు చేనేత వినియోగంపైన మరింత ప్రచారం లభిస్తుందన్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు చేనేత వస్ర్తాలు వినియోగించడం ద్వార మంచి సందేశం వెలుతుందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు కేటీఆర్‌ను మంత్రులు, ప్రధాన ప్రతి పక్షనేతలు అభినందించారు.

KTR