రాజ్‌భవన్‌లో రాష్ట్రపతికి విందు….

243
Pranab Mukherjee

రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు, ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శీతాకాల విడిది కోసం ఈ నెల22వతేదీన హైదరాబాదుకు  విచ్చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గౌరవార్ధం..గవర్నర్ ఈ విందును ఏర్పాటు చేశారు. ఇద్దరు సీఎంలు పరస్పరం పలకరించుకున్న తర్వాత రాష్ట్రపతికి ఇరువైపులా కుర్చీల్లో ఆశీనులయ్యారు.  కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా ఇద్దరు సీఎంలతో కొద్దిసేపు ముచ్చటించారు. రాష్ట్రపతి కూ తురు శర్మిష్ట ముఖర్జీ, గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ ఆహుతులను ఆప్యాయంగా పలకరించారు

Babu

 ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన విందు కార్యక్రమంలో రెండు రాష్ర్టాల శాసనమండలిల చైర్మన్లు స్వామిగౌడ్, చక్రపాణి, శాసనసభాపతులు మధుసూదనాచారి, కోడెల శివప్రసాద్, కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ఎంపీలు కే కేశవరావు, కల్వకుంట్ల కవిత, తమిళనాడు మాజీ గవర్నర్ కే రోశయ్య, తెలంగాణ డిప్యూటీ సీఎంలు మహమూద్‌అలీ, కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ఏపీ మం త్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, అసెంబ్లీలో విపక్ష నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీఎల్పీ నేత జీ కిషన్‌రెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు.

Pranab-Mukherjee

రాజకీయ ప్రముఖులతో  పాటు క్రీడాకారులు సానియామిర్జా, పీవీ సింధు, కోచ్ గోపీచంద్ తదితరులు హాజరయ్యారు. విందులో పసందైన వంటకాలు వడ్డించారు.