చేనేతకు చేయూత…ఫలిస్తున్న రామన్న ప్రయత్నం

254
- Advertisement -

చేనేత రంగానికి పూర్వ వైభవం తేవడమే రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ కృషిచేస్తున్నారు.చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించడానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్న కేటీఆర్….ప్రజలందరూ చేనేత వస్త్రాలు ధరించేలా చేనేత లక్ష్మి కార్యక్రమాన్ని సైతం తీసుకొచ్చారు. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా తానే నేతన్నకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారి ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరిస్తానని ప్రకటించి…స్పూర్తిగా నిలిచారు.

కేటీఆర్ స్పూర్తితో మొదలైన ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది. సినీ నటుల దగ్గరి నుంచి ప్రజా ప్రతినిధుల వరకు అందరు చేనేతకు చేయూత నందించేందుకు ముందుకొస్తున్నారు. దీంతో గతంతో పోలిస్తే చేనేత వస్త్రాల విక్రయాలు రెట్టింపయ్యాయి. ప్రతి మండేను హ్యాండ్లూం డేగా మార్చిన కేటీఆర్‌….ప్రభుత్వ ఉద్యోగులందరూ చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చారు. దీంతో కలెక్టర్‌ స్ధాయి అధికారుల నుంచి కింది స్ధాయి అధికారుల వరకు ఇదే పద్దతిని ఫాలో అవుతు నేతన్నకు సాయంగా నిలుస్తున్నారు.

KTR encourages handloom textile sector in Telangana

తాను చేనేత వస్త్రాలు ధరిస్తున్నానని, మరి మీ మాటేమిటని.. సినీ ప్రముఖులకు సోషల్‌ మీడియా ద్వారా కేటీఆర్‌ సూచించగా వారి నుంచి విశేష స్పందన వస్తోంది. విలక్షన నటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ మహేష్ బాబు, టెన్నిస్ తార సానియా మీర్జా, రాజ్‌దీప్ సర్దేశాయ్, వివేక్ ఒబెరాయ్, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, పీవీ సింధు, నటి సమంత తదితరులను ఆహ్వానించాగా అందరు పాజిటివ్‌గా స్పందించారు.

కమల్ హాసన్‌తో సహా సానియా మీర్జా మేము సిద్ధమంటూ రీ ట్విట్ చేసి…నేతన్నలకు బరోసా ఇస్తామని తెలిపారు. ఇక అక్కినేని నాగార్జున దంపతులు ఐతే ఏకంగా నేత వస్త్రాల్లో స్మైలింగ్ ఫేసులతో మెరిసిపోయారు.

KTR encourages handloom textile sector in Telangana

కేటీఆర్ పిలుపుతో ఆయా జిల్లాల కలెక్టర్లు కలెక్టరేట్ ప్రాంగణాల్లో టెస్కో స్టాల్స్ ఏర్పాటు చేశారు. కలెక్టర్లే స్వయంగా చేనేత వస్త్రాలను ధరించి ఇతర ఉద్యోగులు, అధికారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అసెంబ్లీ, శాసనమండలి, సచివాలయం, బీఆర్‌కేఆర్ భవన్, ఇతర ప్రముఖ కార్యాలయాల్లో టెస్కో స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విక్రయాలు భారీగా పెరిగాయి. జనవరి 1 నుంచి 8వ తేదీ వరకు చేనేత విక్రయాలు కోటి రూపాయలకు చేరుకున్నాయి. గతంలో చేనేత అమ్మకాలు రోజుకు రూ.5లక్షలు మాత్రమే ఉండేవని, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.12లక్షల వరకు విక్రయాలు జరుగుతున్నాయని టెస్కో అధికారులు చెప్తున్నారు. మొత్తంగా కేటీఆర్ చేసిన ప్రయత్నం మంచి ఫలితాలనిస్తోంది. దీంతో నేతన్నలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -