KTR:మతం పేరుతో ఇంకెన్ని రోజులు రాజకీయాలు?

17
- Advertisement -

మతం పేరుతో ఇంకెన్ని రోజులు రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్..బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నేత కార్మికులకు ఉపాధి ఉండేదని …కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక నేతన్నలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ ఉన్నప్పుడే బాగుందని, కేసీఆర్‌ ప్రభుత్వం పోయిన తర్వాత తమ వాగుల్లో నీళ్లు పోయాయని ప్రజలు వాపోతున్నారని చెప్పారు. మళ్లీ కేసీఆర్‌ వస్తేనే పేదలకు బాగుంటుందని అంతా అంటున్నారన్నారు.

కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌ కుమార్‌ను గెలిపించాలని కోరారు. కాళేశ్వరం, మిడ్‌మానేరు ప్రాజెక్టులను కట్టించింది కేసీఆరేనని..కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదన్నారు.

Also Read:ఘనంగా దాసరి జయంతి వేడుకలు

- Advertisement -