తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. ఇది తెలంగాణకు, ముఖ్యంగా ఆయన స్వగ్రామానికీ గర్వకారణంగా నిలిచింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..ప్రశంసలు గుప్పించారు.
ఇంగ్లాండ్ రాజు చేత హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు నామినేట్ అయినందుకు హృదయపూర్వక అభినందనలు … ఉదయ్ , యుకేలో ప్రజాప్రతినిధిగా పోటీ చేయడం నుంచి ఈ అరుదైన గౌరవం వరకూ సాగిన మీ అసాధారణ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం.మీ కొత్త బాధ్యతల్లో మీకు అన్ని శుభాలు కలగాలి అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కేటీఆర్.
ఉదయ్ నాగరాజు స్వస్థలం సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం, శనిగరం గ్రామం. వరంగల్, హైదరాబాద్‌లలో ప్రాథమిక విద్య, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఉదయ్, అనంతరం లండన్‌లోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ (UCL) లో పాలనా శాస్త్రంలో పీజీ సాధించారు. చదువు పూర్తి చేసిన తర్వాత బ్రిటన్‌లో పాలన, ప్రజాహిత రంగాల్లో సేవలు అందిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రధానమంత్రి సలహా మేరకు, ప్రతిభా ప్రమాణాలు, సామాజిక సేవలను పరిగణనలోకి తీసుకుని ఉదయ్ నాగరాజును హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యత్వం కోసం నామినేట్ చేశారు. ఇది ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా భావిస్తున్నారు.
Wholeheartedly congratulate Sri @uday_nagaraju Garu on being nominated by King of England to the House of Lords 👏
Uday, your incredible journey starting from running for public office in UK leading up to this rare honour is truly inspirational
Wishing you the best in your new… pic.twitter.com/8msMwoRDNi
— KTR (@KTRBRS) December 11, 2025
ఇటీవల లేబర్ పార్టీ ఉదయ్ నాగరాజును నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ నుంచి పార్లమెంటరీ అభ్యర్థిగా ప్రకటించింది. గతంలో కూడా ఆయన లేబర్ పార్టీ తరఫున బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో నిలిచారు. స్థానిక ప్రజల్లో, ముఖ్యంగా భారతీయ వర్గాల్లో ఆయనకు మంచి ఆదరణ లభించింది.
Also Read:మహిళా క్రికెటర్ల పారితోషికాలపై BCCI

