యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు తెలంగాణ వ్యక్తి

7
- Advertisement -

యునైటెడ్ కింగ్‌డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు తెలంగాణ వ్యక్తి ప్రాతినిధ్యం వహించడం విశేష చర్చనీయాంశంగా మారింది. తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. ఇది తెలంగాణకు, ముఖ్యంగా ఆయన స్వగ్రామానికీ గర్వకారణంగా నిలిచింది.

ఉదయ్ నాగరాజు స్వస్థలం సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం, శనిగరం గ్రామం. వరంగల్, హైదరాబాద్‌లలో ప్రాథమిక విద్య, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఉదయ్, అనంతరం లండన్‌లోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ (UCL) లో పాలనా శాస్త్రంలో పీజీ సాధించారు. చదువు పూర్తి చేసిన తర్వాత బ్రిటన్‌లో పాలన, ప్రజాహిత రంగాల్లో సేవలు అందిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రధానమంత్రి సలహా మేరకు, ప్రతిభా ప్రమాణాలు, సామాజిక సేవలను పరిగణనలోకి తీసుకుని ఉదయ్ నాగరాజును హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యత్వం కోసం నామినేట్ చేశారు. ఇది ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఇటీవల లేబర్ పార్టీ ఉదయ్ నాగరాజును నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ నుంచి పార్లమెంటరీ అభ్యర్థిగా ప్రకటించింది. గతంలో కూడా ఆయన లేబర్ పార్టీ తరఫున బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో నిలిచారు. స్థానిక ప్రజల్లో, ముఖ్యంగా భారతీయ వర్గాల్లో ఆయనకు మంచి ఆదరణ లభించింది.

బ్రిటన్‌లో పబ్లిక్ పాలసీ, డిజిటల్ గవర్నెన్స్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ రంగాల్లో ఉదయ్ చేసిన సేవలను అక్కడి ప్రభుత్వం అభినందించగా, ఇప్పుడు హౌస్ ఆఫ్ లార్డ్స్ నామినేషన్ ఆయన ప్రతిభకు మరింత గుర్తింపు ఇచ్చింది.

Also Rea:ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని ఫోన్

- Advertisement -