KTR: ఎమర్జెన్సీని తలపిస్తున్న రేవంత్ పాలన?

0
- Advertisement -

తనను నమ్మి గెలిపించిన కొడంగల్ రైతులను జైలుకు పంపి.. మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో మాట్లాడిన కేటీఆర్… రాష్ట్రంలో రేవంత్ పాలన, ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపిస్తుందన్నారు.

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమన్నారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్‌కు ఆపాదించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారని అన్నారు.

పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్‌లు తప్పవని బెదిరిస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుందని అన్నారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.

Also Read:Supreme Court: బుల్డోజర్ జస్టిస్‌ చట్ట విరుద్దం

- Advertisement -