టీఆర్ఎస్‌ పార్లమెంటరీ మీటింగ్స్‌ వాయిదా..

255
ktr trs meetings
- Advertisement -

మార్చి 1నుండి జరగాల్సిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రకటించారు. దేశ సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సమావేశాలు వాయిదా వేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్ధాయి ప్రచారానికి సిద్ధమయ్యారు కేటీఆర్‌. మార్చి 1 నుంచి 12వరకూ పార్లమెంట్ సన్నాహాక సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మార్చి1న కరీంనగర్,మార్చి 2న వరంగల్, భువనగిరి, మార్చి3న మెదక్, మల్కాజ్ గిరి, మార్చి 6న నాగర్ కర్నూల్, చేవెళ్ల, మార్చి 7న జహీరాబాద్, సికింద్రబాద్,మార్చి 8న నిజామాబాద్, అదిలాబాద్,మార్చి 9న పెద్దపల్లి, రామగుండం,మార్చి 10న మహబూబాబాద్, ఖమ్మం,మార్చి 11న నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల సమావేశాలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు.

అయితే ప్రస్తుతం భారత్‌-పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడం,భారత పైలట్‌ అభినందన్‌ పాక్ సైన్యం చెరలో ఉండటంతో సమావేశాలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు కేటీఆర్. పైలట్ అభినందన్‌ ధైర్యాన్ని మెచ్చుకుంటూ పాకిస్తాన్‌ సైన్యం చిత్రహింసలు పెడుతున్నా దేశ రహస్యాల గురించి అడుగుతున్నా నోరు మెదపని పైలట్ గుండె ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

- Advertisement -