పద్మారావు గౌడ్‌కు మంత్రి కేటీఆర్ బర్త్‌ డే విషెస్‌..

333
ktr minister

నేడు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌ జన్మదినం సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆయనకు విషెస్‌ తెలిపారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్‌లోని మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కేటిఆర్. అనంతరం పద్మారావు గౌడ్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ కొన్ని కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ktr wishes

కరోనా వ్యాప్తి నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ముఖానికి మాస్క్ వేశారు మంత్రి కేటీఆర్. మంత్రి కేటీఆర్ వెంట మేయర్ బొంతు రామ్మోహన్ , టి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు రామేశ్వర్ గౌడ్ , కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిప్యూటి స్పీకర్ పద్మారావు గౌడ్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఫంక్షన్ హల్‌ను పరిశీలించారు.

srinivas goud