గుత్తా సుఖేందర్ రెడ్డికి కేటీఆర్‌ బర్త్‌ డే విషెస్‌..

176
minister ktr
- Advertisement -

తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు బర్త్‌ డే విషెస్‌ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్‌ ఈ మేరకు ట్విట్టర్‌లో విషెస్‌ అందించారు.ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -