- Advertisement -
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. శనివారం వరంగల్ తూర్పు నియోజకవర్గం ఖిలావరంగల్‌లో ఆయన కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు మంత్రి ఎర్రబెల్లి. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరెందర్, కార్పోరేటర్లు, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 105 మంది వికలాంగులకు మూడు చక్రాల మోటార్ సైకిళ్లు అందజేశారు. ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.
- Advertisement -