తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ (BRS) పార్టీ ప్రజా క్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమైంది. అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శిస్తూ, రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించబోయే వ్యూహాన్ని వెల్లడించారు.
పార్టీ అధినేత కేసీఆర్ మళ్లీ ప్రజల మధ్యకు రాబోతున్నారని కేటీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 20వ తేదీన జగిత్యాలలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభ ద్వారా ప్రభుత్వంపై పోరాట శంఖారావాన్ని పూరించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ఎక్కడైతే డిక్లరేషన్లు ప్రకటించారో, అదే ప్రాంతాల్లో మేము మళ్లీ సభలు పెడతాం. వారి హామీలను గుర్తు చేస్తూ ప్రజలను జాగృతం చేస్తాం అన్నారు.
దళిత వాడల్లో ప్రచారం: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట జరిగిన మోసాన్ని ప్రతి గిరిజన తండాకు, ప్రతి దళిత వాడకు చేరవేస్తామని ఆయన స్పష్టం చేశారు.రైతుబంధు, దళితబంధు వంటి విప్లవాత్మక పథకాలను తీసుకురావాలంటే కేసీఆర్ గారి లాంటి ‘ఖలేజా’ ఉన్న నాయకుడికే సాధ్యమని కేటీఆర్ కొనియాడారు.
Also Read:AP:గ్రామాలకు అన్న క్యాంటీన్లు
మహనీయుడు అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు యువతకు పలు సూచనలు చేశారు.అంబేద్కర్ స్ఫూర్తి: యువత బాబాసాహెబ్ అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని గొప్పగా చదువుకోవాలని పిలుపునిచ్చారు.యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి. వ్యసనాలకు బానిసలైతే జీవితాలు నాశనమవుతాయి…ఆన్‌లైన్ గేములకు బానిసలై లక్షల రూపాయలు పోగొట్టుకోవద్దని, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయవద్దని హరీష్ రావు కోరారు.

