సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి త్వరలో బీఆర్ఎస్‌లో చేరనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగిత్యాలలో తన అనుచరులతో సమావేశమైన జీవన్ రెడ్డి… గతంలో మేడిగడ్డ బ్యారేజీని సాకుగా చూపి కేసీఆర్‌ను దోషిగా చిత్రించాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
మేడిగడ్డ అంశాన్ని రాజకీయాలకు వాడుకోవాలని చూశారు. కానీ మూడేళ్లు గడిచేసరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి దోషిగా మారుతున్నాడు. అందుకే తప్పు తెలుసుకుని గత వారం రోజులుగా మేడిగడ్డను ఎలా పునర్నిర్మించాలని రేవంత్ ఆలోచిస్తున్నాడు అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో భవిష్యత్తులో కరువు వస్తే దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు.
తాను బిఆర్ఎస్ పార్టీలో చేరడం తన రాజకీయ జీవితంలో ఒక నూతన అధ్యాయమని జీవన్ రెడ్డి అభివర్ణించారు. నేను ప్రజా జీవితంలోకి రాకముందు నుండే కేసీఆర్ గారు నాకు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా సుపరిచితులు. మా మధ్య ఉన్న అనుబంధం ఈనాటిది కాదు అని గుర్తు చేసుకున్నారు.
Also Read:‘డెకాయిట్’..మంచి సినిమా తీశాం!
తనతో ఉన్న అనుబంధం కేవలం రాజకీయాల కోసమే కాదని, అది వ్యక్తిగతమైనదని కేసీఆర్ కూడా తరచూ చెబుతుంటారని జీవన్ రెడ్డి వెల్లడించారు.

