ఏదేవుడు చెప్పిండు తన్నుకు చావండని..ప్రశ్నించిన కేటీఆర్‌

29
ktr
- Advertisement -

దేశంలో, రాష్ట్రంలో మ‌త విద్వేషాల‌ను సృష్టిస్తున్న నాయ‌కుల‌పై టీఆర్ఎస్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏ దేవుడు చెప్పిండు.. త‌న్నుకు చావండ‌ని కేటీఆర్ ప్ర‌శ్నించారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డితో కలిసి విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. అర్థం కాని విష‌యం ఏంటంటే.. ఏ దేవుడు చెప్తున్నాడు త‌న్నుకు చావండ‌ని. ఏ మ‌తం దేవుడైనా చెప్పిండా? అని ప్ర‌శ్నించారు. కృష్ణుడు చెప్పిండా? రాముడు చెప్పిండా? యేసుక్రీస్తు చెప్పిండా? అల్లా చెప్పిండా? నా మ‌న‌షుల‌ను పంపిస్తున్న భూమి మీద‌కు.. ఒక‌రికొక‌రు త‌న్నుకు చావండి.. ఎవ‌రి దేవుడు గొప్ప‌ అనే కాంపిటీష‌న్ పెట్టుకొని త‌న్నుకు చావండి అని చెప్పిండా? అని కేటీఆర్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఎందుకు కొట్లాడుతున్నాం.. ఎవ‌రి కోసం కొట్లాడుతున్నాం. ఏ కార‌ణం చేత కొట్లాడుతున్నాం మ‌నం. దేని మీద దృష్టి పెట్టాలి. అస‌లు మ‌నం దేని మీద ప‌ని చేస్తున్నామని ప్రశ్నించారు.

ఈ దేశంలో నీళ్లు లేవ‌ని ఒక‌రు ఏడుస్తుంటే.. తిండి లేక చ‌స్తుంటే, భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఇంటికి నిన్న గాక మొన్న క‌రెంట్ వ‌స్తే.. దాని మీద మ‌న‌కు సోయి లేదు. ఏ దేవుడు గొప్ప‌? అని ప్ర‌శ్నించుకుంటున్నారు. మ‌తాల మీద ప‌డి మ‌నం ఎక్క‌డ్నో ఉన్నాం. చైనా వాడేమో 16 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరిండు. మ‌నం ఏమో 3.1 ట్రిలియ‌న డాల‌ర్ల వ‌ద్ద‌నే ఆగిపోయాం. ఇది సిగ్గుప‌డాల్సిన ప‌రిస్థితి. కానీ తెలంగాణ రాష్ట్రం దానికి భిన్నంగా ప‌ని చేస్తుంది. తెలంగాణ గ‌త 8 ఏండ్ల‌లో సాధించిన విజ‌యాలు, నిధుల విష‌యంలో ఒక్క మాటలో చెప్పాలంటే. మీరు బుద్ధి జీవులు కాబ‌ట్టి చెప్తున్నాను. 140 కోట్ల భార‌త‌దేశ జ‌నాభాలో మ‌నం కేవ‌లం 4 కోట్లు మాత్ర‌మే. మ‌నం దేశానికి 5 శాతం జీడీపీని కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది పురోగ‌తి అంటే అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

- Advertisement -