ప్రజా సంక్షేమం కోరుకునే శక్తులు ఏకం కావాలి: సీఎం కేసీఆర్‌

36
cmo
- Advertisement -

దేశ సౌభాగ్యాన్ని గుణాత్మకంగా అభివృద్ధి పరిచే వ్యవసాయ సంక్షేమం దిశగా సాగే సుపరిపాలన కోసం అడుగులు వేయాల్సి ఉందని రైతు సంఘాల నేతలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న వ్యవసాయం సాగునీరు, విద్యుత్‌ రంగాల అభివృద్ధి రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటు పలు రంగాల్లో ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వివిధ రాష్ట్రాలనుంచి తెలంగాణకు వచ్చిన రైతు సంఘాల నేతలు ప్రగతిభవన్‌లో ఇవాళ సీఎం కేసీఆర్‌ను కలిశారు. వ్యవసాయం సాగునీటి రంగం తదితర అంశాలపై రూపొందించిన డాక్యుమెంటరీని వారంతా సీఏంతో కలిసి వీక్షించారు.

అనంతరం రైతు సంఘాల నాయకులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు గడిచిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ పాలన ఇంకా గాడిలో పడలేదు. రైతు సమస్యల పరిష్కారం కోసం దేశం పాలకులు ఆలోచించాలి. ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకుండా పోవడానికి గల కారణాలను అన్వేషించాలి. దేశంలో అనేక వర్గాలు తమ ఆకాంక్షలు హక్కులను నెరవేర్చుకునేందుకు ఇంకా పోరాటాలకు ఎందుకు సిద్ధపడుతున్నాయో మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైతు సమస్యలకు ఇంకా ఎందుకు పరిష్కారం దొరకడం లేదో ఈ విషయంలో దేశ పాలకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో చర్చించుకోవాలి.

చట్టసభల్లో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన వాళ్లు నిర్లక్ష్యం వహిస్తుండటం ప్రజల కోసం పనిచేసే వాళ్లను దేశ పాలకులే ఇబ్బందులకు గురిచేయడం అనే పొంతన లేని ప్రక్రియ దేశంలో కొనసాగుతుండడం దురదృష్టకరం. ఇటువంటి పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడేందుకు ప్రజల సంక్షేమం కోరుకునే శక్తులు ఏకం కావాల్సి ఉంటుంది. కేంద్ర పాలకుల నిర్లక్ష్యం లాంటి విషయాలను విశ్లేషించుకొని చర్చించాల్సిన సందర్భం ఇదే అని సీఎం కేసీఆర్ అన్నారు.

- Advertisement -