ఏరోస్పేస్ రంగంలో అద్భుత అవకాశాలు:కేటీఆర్

269
ktr
- Advertisement -

ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ‌కు అద్భుత అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ హోటల్ తాజ్‌కృష్ణలో టాటా బోయింగ్ 100వ అపాచీ ఫ్యూజ్‌లేజ్ డెలివరీ వేడుక జరుగగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు కేటీఆర్జ

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల‌కు రాష్ర్ట‌ ప్ర‌భుత్వం అత్యంత‌ ప్రాధాన్యం ఇస్తుంద‌ని, ఈ రెండు రంగాల్లో దేశంలోనే తెలంగాణ క్రియాశీల రాష్ర్టంగా ఆవిర్భ‌వించింద‌ని వెల్లడించారు. హైద‌రాబాద్‌లో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగం.. ఎఫ్‌డీఐ ఫ్యూచ‌ర్ ఏరోస్పేస్ సిటీస్ ర్యాంకింగ్స్ 2020లో ప్ర‌పంచంలో నంబ‌ర్ వ‌న్ ర్యాంకు సాధించింద‌ని అని గుర్తు చేశారు.

డీఆర్‌డీవో, బీడీఎల్, ఈసీఐఎల్, బీఈఎల్, హెచ్ఏఎల్ వంటి ఎన్నో సంస్థ‌ల‌కు హైద‌రాబాద్ నిల‌యంగా మారింద‌న్నారు. ఏరోస్పేస్ స‌ర‌ఫ‌రా గొలుసుకు హైద‌రాబాద్ అనుకూలంగా ఉంద‌ని ఉద్ఘాటించారు. బెంగ‌ళూరు కంటే హైద‌రాబాద్‌లోనే మెరుగైన వ‌స‌తులు ఉన్నాయ‌న్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తులు ఇస్తున్నామని చెప్పారు.

- Advertisement -