కేటీఆర్ బర్త్ డే…మొక్కలు నాటిన నాగబాబు

241
nagababu
- Advertisement -

గ్రీన్ఇండియా చాలెంజ్‌, ముక్కోటి వృక్షార్చన, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు మణికొండలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు సినీ నటుడు నాగబాబు..

ఈ సందర్భంగా మాట్లాడిన నాగబాబ….కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఒకే గంటలో మూడు కోట్ల మొక్కలు నాటే బృహత్కర కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అయి మొక్కలు నాటానని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఈ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తోంది…సీఎం కేసీఆర్ పర్యవరణంపై చూపే ప్రేమ వెలకట్టలేనిదన్నారు.రాష్ట్రం ఆకుపచ్చని తెలంగాణ గా మారుతుంది…నన్ను ఇందులో భాగస్వామ్యం చేసిన ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు…చమ్మక్ చంద్ర,అదిరే అభి, గెటప్ శ్రీను ముగ్గురిని మొక్కలు నాటి మంత్రి కేటీఆర్ గారికి గిఫ్ట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు నాగబాబు.

- Advertisement -